పరమగీతము 4 : 1 (TEV)
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.
పరమగీతము 4 : 2 (TEV)
నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱల కదుపులను పోలియున్నది.
పరమగీతము 4 : 3 (TEV)
నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి.
పరమగీతము 4 : 4 (TEV)
జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము.
పరమగీతము 4 : 5 (TEV)
నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.
పరమగీతము 4 : 6 (TEV)
ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.
పరమగీతము 4 : 7 (TEV)
నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.
పరమగీతము 4 : 8 (TEV)
ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు.
పరమగీతము 4 : 9 (TEV)
నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.
పరమగీతము 4 : 10 (TEV)
సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము.
పరమగీతము 4 : 11 (TEV)
ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్న ట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.
పరమగీతము 4 : 12 (TEV)
నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.
పరమగీతము 4 : 13 (TEV)
నీ చిగురులు దాడిమవనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు
పరమగీతము 4 : 14 (TEV)
జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.
పరమగీతము 4 : 15 (TEV)
నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను పర్వతప్రవాహము.
పరమగీతము 4 : 16 (TEV)
ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: